ఎవర్‌గ్రీన్‌ కెరీర్‌ అగ్రికల్చర్‌

ఇంటర్‌ తర్వాత కెరీర్‌ గురించి ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచనలు ప్రారంభించి ఉంటారు. అయితే చాలామంది రొటీన్‌గా ఎంసెట్‌, ఐఐటీ, ఎన్‌ఐటీ లేదా నీట్‌ పరీక్షల ద్వారా ఆయా సంప్రదాయ కోర్సుల్లో చేరాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ వాటికంటే అద్భుతమైన ఫీల్డ్స్‌  ఎన్నో ఉన్నాయి. మానవాళి మనుగడ ఉన్నంత వరకు తిరుగులేని కెరీర్‌ అగ్రికల్చర్‌. దీనిలో యూజీ, పీజీ, రిసెర్చ్‌ కోర్సులు చేసినవారికి భారీ వేతనాలతోపాటు భద్రమైన జీవితం ఉంటుంది. ఎన్‌టీఏ నిర్వహించే ఐకార్‌ ఏఐఈఈఏ ద్వారా అగ్రికల్చర్‌ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో కోర్సులు, అర్హతలు  సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..