కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. మంగళవారం సాయంత్రానికే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 100 మార్కును దాటగా.. ఇప్పుడు మరో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటకలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 105కు చేరింది. కొత్తగా నమోదైన నాలుగు కేసుల్లో 37 ఏండ్లు, 27 ఏండ్ల వయసున్న ఇద్దరు మైసూరులోని నంజన్‌గడ్‌కు చెందిన వారు కాగా.. 24 ఏండ్లు, 33 ఏండ్ల వయసున్న మరో ఇద్దరు బెంగళూరుకు చెందిన వారుగా తేలిందని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, కర్ణాటకలో కరోనా బారినపడి ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు. మరో 9 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కర్ణాటకలో మరో నలుగురికి కరోనా.. 105కు చేరిన కేసులు